10 వ తరగతి పరీక్షా ఫలితాలు కోసం రైట్ సైడ్ లింక్ చుడండి

10 వ తరగతి పరీక్షా ఫలితాలు ఈరోజు విడుదల/SSC results release today/హ్యాపీ న్యూ ఇయర్#క్రిస్మస్ వేడుకలు ఘనంగా నిర్వహించిన గ్రామస్తులు,స్టేజి స్కిట్స్ తో అలరించిన యువకులు #హెలెన్ తుపాన్ తాకిడికి దెబ్బ తిన్న పంటపొలాలు నేలకోరికిన కొబ్బరి ,అరటి జామచెట్లు #శబరిమల సందికి బయలుదేరిన అయ్యప్ప భక్తులు#ఘనం గా ముగిసిన దసరా ఉత్సవాలు #:>

About K.Valli

     కందరవల్లి ఒక అందమైన చిన్న పల్లెటూరు ,గ్రామం లో 1500 మంది నివసిస్తున్నారు ,ఎక్కడ గ్రామా ప్రజలు అన్నదమ్ముల వాలే కలిసి వుంటారు ,సమస్యలు ఏవి అయిన గ్రామా పెద్దల సమక్షం లో పరిష్కరించుకుంటారు. 
ఆచంట మండలం లో అతి చిన్న పంచాయతి గా కందరవల్లి వున్నది .


జనాభా : 1500 సుమారు గా 

 voters :752 

వ్యవసాయం :

               వరి(రభి,ఖరిఫ్ ) అంతర పంటలు  గా :మినుములు ,పెస్సాలు,రాగులు ,జొన్నలు ,పశువుల దాన లాంటివి వేసవి కలం లో వేస్తారు .

జీవనాధారం :

               ఎక్కువ మంది యువకులు పెద్దవారు పాత ఇనుము వ్యాపారం చేస్తారు .కొబ్బరి వలువు వలవడం ,కొబ్బరి కాయల వ్యాపారం ,వ్యవసాయం ,వడ్రింగి పనులు ,కుల వృతుల వారు వాళ్ళ వాళ్ళ పనులు చేసుకుంటూ జీవన సాగిస్తారు .

కొబ్బరి   చెట్టు : 

                   గ్రామం లో కొబ్బరి చెట్టు లేని ఇల్లు ఒక్కటికూడా లేదు అంటే అతియసోక్తి కాదు ,కొబ్బరి చెట్టును దేవుని లాగా పూజిస్తారు 

దేవాలయాలు :


శివాలయం :   

          గ్రామం లో అతి పురాతనమైన గుడి సుంరు 100 సంవసతరాలు పూర్తి  చేసుకున్నది ,గుడి లో ప్రతి సోమవారం ,శనివారం ప్రత్యేక పూజలు జరుగుతాయి ,గుడి దేవాదాయ ధర్మదాయ శాఖా అధీనం లో వుంది.

రామాలయం:గ్రామలో నూతనం గా గ్రామస్తుల సహకారం తో  పునర్నిర్మించబడినధీ  


శ్రీ ఉయ్యూరు వీరమ్మ పెరంటలమ్మ గుడి :

                   
 గ్రామా దేవత వీరమ్మ తల్లి గుడికి పెద్ద  చరిత్ర వుందని పెద్దలు చెపుతుంటారు ,అందరిని చల్లగా చుసుకుంటది.ప్రతి ఆదివారం గుడికి పెద్ద సంఖ్యలో భక్తులు విచ్చేసి అమ్మ వారిని దర్శించు కుంటారు 

రావులమ్మ తల్లి గుడి :

                ఈ అమ్మ వరి గుడి గ్రామా నది బొడ్డున వుంటుంది ,అందుకే ప్రజలు అమ్మవారిని నడివీది లో రావులమ్మ అని పిలుస్తారు ,ఈ అమ్మ  వారు మార్చ్ లో అతవరింటి కి వెళ్లి మల్లి ఉగాది కి గ్రామా మధ్యలోని గుడి కి తిరిగి తెస్కుని వస్తారు 

పండుగలు ::


సంక్రాంతి :

        గ్రామమం లో జరిగీ అతి పెద్ద పండుగా సంక్రాంతి కి భోగి ,మకర సంక్రాంతి, కనుమ ,ఈ మూడు రోజు లు ప్రజలు ఆనందం తో జరుపుకుంటారు.భోగి మంటల కొరకు నెలరోజుల ముందు నుండి గ్రామా యువకులు గుండాలు పోగుచేసి పెద్ద పెద్ద భోగి మంటలు వేస్తారు ,ఈ గ్రామమం లో చాల ఏళ్ళు నుండి రెండు వీడులకు భోగి మంటల విషయం లో పోటి వుంది .కోడిపందాలు స్పెషల్ 
కనుమ రోజు ప్రభల గ్రామం లో ఊరేగించి గ్రామా చివర జరగబోయే తిర్దని కి తీసుకు వెళతారు ,ప్రభల ఊరేగింపు చుదముచతగ వుంటది .












వీరమ్మ తల్లి తీర్ధం ::


మర్చి నెల లో జరుగుతుంది ,గ్రామస్తులు అంత కలిసి కట్టు గా అమ్మ వరి జాతరను 5 రోజుల పటు జరిపిస్తారు ,మొదటి రోజు జాతర ,రెండవ రోజు నిప్పుల గుండం ,మిగతా 3 రోజులు సంస్కృతి కార్య క్రమాలు జరుగుతాయి.చుట్టూ పక్కల గ్రామా ప్రజలు ,బంధువులు పెద్ద సంఖ్యా లో పాల్గొంటారు ,








శివ పార్వతుల కళ్యాణం :


మే నెల లో గ్రామా ప్రజల క్షమాక్షం లో ఘనం గా జరుగుతుంది ,కుంకం భరణు లో పంచి పెట్టడం ఈ పండగలోని ప్రత్యేకత .


శ్రీ రామ నవమి :



నవమి వేడుకలు ఘనం గా జరగడం తో పాటు అన్నదాన కార్యక్రమం గ్రామా ప్రజల సమక్షం లో జరుగుతాది .












వినాయక చవితి :


 చవితి 5 రోజుల పండగ దీనికి కమిటి కలదు కమిటి వాళ్ళు చవితి చేయడం లో చాల వరకు పక్క వురి వాళ్ళ కు పోటి ని ఇస్తారు ,అన్నదానం ,5 వ రోజు అంగరంగ వైభవం గా నిమజ్జన కార్య క్రమమం జరుగుతుంది 



దసరా :
దసరా రాయల్ టైగర్స్ యూత్ ఆధ్వర్యం లో జరుగుతుంది .10 రోజుల పాటు భక్తి శ్రద్దల తో చేస్తారు 












క్రిస్ట్ మస్స్:


ప్రభు ఏసు క్రీస్తు ని డిసెంబర్ 25 న గ్రామం లో గల చర్చ లో ప్రత్యక పార్ధనలు చేసి పూజిస్తారు,గ్రామస్తులు 
భక్తు అధిక మొత్తం లో పాల్గొని వేడుకలు ఘనం గా నిర్వయిస్తారు